
శిల్పారామం తరహాలో టెర్రకోటకు అంగళ్లులో క్రాఫ్ట్ విలేజ్
కురబలకోట : తిరుపతి శిల్పారామం తరహాలో టెర్రకోట హస్త కళాకారుల సంక్షేమం కోసం కురబలకోట మండలంలోని అంగళ్లు బైపాస్ పక్కన క్రాఫ్ట్ విలేజ్‌ను ఏర్పాటు చేయిస్తామని రాష్ట్ర హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన అంగళ్లులోని టెర్రకోట సీఎఫ్‌సీ సెంటర్‌ను సందర్శించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ హస్తకళలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థిక వనరులను తీసుకు రావడంతో పాటు టెక్నాలజీని తీసుకు వస్తామన్నారు. ఈ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వస్తామన్నారు. ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్‌చే వీటికి ప్రమోషన్ కూడా చేయించి డిమాండ్ సృష్టించి తగిన ఆదాయ వనరులు పెంపొందేలా చూస్తామన్నారు. పీ–4 పథకంలో హస్త కళలను చేర్చామన్నారు. టెర్రకోట కళాకారులకు బంకమట్టి, మిషనరీ సౌకర్యం కల్పిస్తామన్నారు. శాలివాహన చైర్మన్ ఈశ్వర్, నియోజక వర్గ టీడీపీ నాయకులు డి. జయచంద్రారెడ్డి, పి. సాయినాఽఽథ్, సీఈఓ కృష్ణమూర్తి, టెర్రకోట సంఘ నాయకులు దుర్గం మల్లికార్జున, కంటేవారిపల్లె బాలాజీ, శ్రీనివాసులు, సురేంద్ర, పద్మావతమ్మ, కళావతి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్