
పటిష్ట బందోబస్తు ఏర్పాటు : ఎస్పీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12వ తేదీన ఒంటిమిట్ట మండలంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించామన్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్ సుధాకర్, కడప టౌన్ డీఎస్పీ ఎ వెంకటేశ్వర్లు, స్పెషల్ ప్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఆర్ పురుషోత్తం రాజు, ఒంటిమిటట సిఐ టి బాబు, సిద్దవటం ఎస్‌ఐ ఎం మహమ్మద్ రఫీ, సిబ్బంది పాల్గొన్నారు.

పటిష్ట బందోబస్తు ఏర్పాటు : ఎస్పీ