
పరిసరాల శుభ్రతతోనే దోమల నివారణ
రాయచోటి : పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నివారణకు మార్గమని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు. మలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సోమవారం రాయచోటిలోని ఎస్‌ఎన్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎగువ అబ్బవరం సచివాలయం, రాయుడు కాలనీలో ఏసీఎం స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్, అంగన్ వాడీ సెంటర్‌లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ దోమల నివారణకు స్ప్రేయింగ్ అనేది ప్రతి ఇంటికి చేయించుకోవాలన్నారు. 2027 నాటికి మలేరియా రహిత జిల్లాగా మార్చాలని ఆయన వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆ దిశగా సిబ్బంది ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి నవీన్, మలేరియా సబ్ యూనిట్ అధికారి జయరామయ్య, సూపర్ వైజర్ నూర్జహాన్, హెల్త్ అసిస్టెంట్ రవిశంకర్, రామచంద్ర, ఏఎన్‌ఎం రేష్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.