
ఆటో ఢీకొని..
మదనపల్లె రూరల్ : ఆటో ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. మదనపల్లె పట్టణం అగడ్తలవీధికి చెందిన ఉదల్‌సింగ్ కుమారుడు నవీన్‌సింగ్(24) బి.కొత్తకోట మండలం గట్టులో నూతన వస్త్ర దుకాణం ప్రారంభించాడు. రాత్రి మదనపల్లె నుంచి ద్విచక్రవాహనంలో గట్టుకు బయలుదేరి వెళుతుండగా, మార్గమధ్యంలోని విశ్వం కాలేజ్ సమీపంలోని పెట్రోల్‌బంకు వద్ద ఆటో మలుపు తిరుగుతుండగా వేగంగా వెళ్లి ఢీకొన్నాడు. ప్రమాదంలో నవీన్‌సింగ్ తీవ్రంగా గాయపడగా, ఆటోడ్రైవర్ సునీల్(25) స్వల్పంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు.