
ఏకశిలానగిరిలో జెడ్పీ ఎన్నికల సందడి!
రాజంపేట: ఒంటిమిట్ట కోదండరామస్వామి క్షేత్ర మైన ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లో జెడ్పీ ఎన్నికల సందడి మొదలైంది. శుక్రవారంతో జిల్లా పరి షత్ ప్రాదేశిక నియోజకవర్గ (జెడ్పీటీసీ) స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈనెల 5వ తేదీవరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను నిర్వహించనున్నారు. 12న పోలింగ్, 14న కౌంటింగ్ ప్రకియ జరగనుంది. రాష్ట్ర అధికారిక రామాలయం కలిగిన ప్రాంతం కావడంతో ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.
● 1994–1995లో జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజకవరక్గ సభ్యుల ఎన్నిక ప్రారంభమైంది. తొలి జెడ్పీటీసీగా 1995లో తోకా నరసింహులు ఎన్నికయ్యారు. అనంతరామయ్య, ఇరంగరెడ్డి రాజ్యలక్ష్మీ, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఆకేపాటి అమరనాఽథరెడ్డిలు జెడ్పీటీసీలుగా ఒంటిమిట్టకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే,వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి ఒంటిమిట్ట నుంచి జిల్లా పరిషత్ చైర్మన్‌కు ఎంపికయ్యారు. అలాగే ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కూడా జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్‌గా ఎంపికయ్యారు.
● జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలంలో 30 పోలింగ్ బూత్‌లు, 17 పోలింగ్ కేంద్రాలు ఉన్నా యి. పకడ్బందీగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.
ఓటర్లలిలా..
మండలంలో 24,606 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,556 మహిళలు, పురుషులు 12,050 మంది ఉన్నారు. ఎన్నికల అధికారుల ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చారు.
తేలని కూటమి అభ్యర్ధి ఎంపిక
కూటమి పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయం ఇంకా తేలలేదు. వర్గాల వారీగా నామినేషన్లు దాఖాలు చేసుకున్నారు. పార్టీ బీ–ఫాం ఎవరికి ఇస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది. ముద్దుకృష్టరెడ్డి అడ్డలూరు,కడప బాబుసాహెబ్, బొడ్డె వెంకటరమణ(2సెట్లు), దున్నతల రఘరాంరెడ్డి,వెంకటేశ్ నంద్యాల,వెంకటసుబ్బయ్య ఆలూరు, కుమారి శివరామకృష్ణారెడ్డి, నల్లగొండు వెంకటసుబ్బారెడ్డిలు నామినేషన్లు వేశారు అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే టీడీపీ బీ–పాం ఇస్తుందనే భావనలు కూటమి వర్గాల్లో కొనసాగుతున్నాయి.
● కాంగ్రెస్ పార్టీ నుంచి రాజంపేటకు చెందిన బలిజ సామాజికవర్గానికి చెందిన పూలభాస్కర్ నామినేషన్ దాఖాలు చేశారు.
వైఎస్సార్‌సీపీ నుంచి..
వైఎస్సార్‌సీపీ నుంచి ఇరగంరెడ్డిసుబ్బారెడ్డి, ఇరగంరెడ్డి శ్రీకర్‌రెడ్డిలు నామినేషన్లు దాఖాలు చేశారు. ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబులు సుబ్బారెడ్డి గెలుపు కోసం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఒంటిమిట్ట నుంచే జెడ్పీ పీఠంపై ఆకేపాటి
ఒంటిమిట్ట జెడ్పీటీసీగా ఉన్న సమయంలో ఆకేపాటి అమరనాఽథరెడ్డి జిల్లాపరిషత్ చైర్మన్‌గా నియమితులైయ్యారు. తనదైన రీతిలో జిల్లాపరిషత్ పరంగా ప్రజలకు సేవలందించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జెడ్పీటీసీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అన్నమయ్య వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు.
ప్రచారంలో ముందంజలో వైఎస్సార్‌సీపీ
కూటమిలో అభ్యర్థుల ఎంపిక గందరగోళం

ఏకశిలానగిరిలో జెడ్పీ ఎన్నికల సందడి!

ఏకశిలానగిరిలో జెడ్పీ ఎన్నికల సందడి!

ఏకశిలానగిరిలో జెడ్పీ ఎన్నికల సందడి!