
గల్ఫ్ సమస్యల పరిష్కారానికి కృషి
రాజంపేట: గల్ఫ్‌వాసుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్‌రెడ్డిఅన్నారు. ఆదివారం మేడా భవన్‌లో వైఎస్సార్‌సీపీ గల్ఫ్ నేతలు ఆయనను కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. గల్ఫ్ దేశాల నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయంలో రాకపోకలను కొనసాగించేలా తన వంతు కృషి చేస్తానన్నారు. గల్ఫ్ దేశాల్లో వైఎస్సార్‌సీపీ నేతల సేవలు ప్రశంసనీయమన్నారు.కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, అడ్వైజర్ మహేశ్వర్‌రెడ్డి, కో కన్వీనర్ మన్నూర్ చంద్రశేఖర్‌రెడ్డి, గల్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు వి.పి రామచంద్రారెడ్డి, పులపత్తూరు సురేష్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐలు రాజాసాబ్, గోపాలరెడ్డి పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎలక్షన్ ఆఫీసర్ నిత్యపూజయ్య ఆధ్వర్యంలో నామినేషన్ స్వీకరణ చేపట్టగా అన్ని పోస్టులకు ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలు అయ్యాయి. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇందులో ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడిగా సురేష్, కార్యదర్శిగా వెంకటసుబ్బయ్య, వైస్ ప్రెసిడెంట్‌గా ఖాదర్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీగా మల్లికార్జునరాజు, ట్రెజరర్‌గా రాధాకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివప్రసాద్, ఉమెన్ సెక్రటరీగా ఇందుమతి, ఈసీ మెంబర్లుగా బాలనరసయ్య, శివప్రసాద్, చరణ్‌లు ఎన్నికయ్యారు.
● రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్‌రెడ్డి