
కోర్టు కాంప్లెక్స్‌ను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూ
రాజంపేట : స్థానిక కోర్టు క్లాంపెక్స్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని శనివారం పరిశీలించారు. కోర్టు క్లాంపెక్స్ ఒప్పందంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం అప్పగించలేదని రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు అభ్యర్ధన మేరకు జిల్లా ప్రధానన్యాయమూర్తి రాజంపేట కోర్టుకు విచ్చేశారు. కోర్టు భవనాలు, తహసీల్దార్ కార్యాలయ భవనాలను ఆమె పరిశీలించారు. బార్ అసోసియేషన్ న్యాయవాదుల సమావేశంలో పాల్గొన్నారు. న్యాయవాదుల నుంచి కోర్టు పరమైన సమస్యలపై వినతులను అందుకున్నారు. కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి ప్రవీణ్‌కుమార్, జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాశ్, హైకోర్టు న్యాయవాది కొండూరు శరత్‌కుమార్‌రాజు, రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు, తహసీల్దార్ పీరుమున్నీ, ఏజీపీ మౌనిక, సీనియర్ న్యాయవాదులు రవీంద్ర, రామచంద్ర, బి.నాగరాజగుప్తా, పి.సురేష్‌కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.