
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రామసముద్రం : కర్నాటక రాష్ట్రం పెగలపల్లెకు చెందిన మునస్వామిశెట్టి(45) మండలంలోని గౌతిమ్మరాయస్వామి ఆలయ దర్శనానికి వచ్చి తిరుగుప్రయాణంలో గాంధీనగర్ వద్ద గుంతను తప్పించబోయి ద్విచక్రవాహనం బోల్తా పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి బాధితుడిని పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ, ఆటో ఢీ : ఒకరి మృతి
రాజంపేట : కడప–రేణిగుంట జాతీయరహదారిలోని బోయనపల్లె వద్ద శనివారం లారీ–ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మున్సిపాలిటి పరిధిలోని రామ్‌నగర్‌కు చెందిన నాగారం లక్ష్మీదేవి(46) అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలిలా..శేషమాంబంపురం ఆటోడ్రైవర్ కొరముట్ల సాంబయ్య ఆటో(ఏపీ49డబ్ల్యుఈ7482)లో మృతురాలితోపాటు నాగారం దివ్య, ఓబులవారిపల్లెకు చెందిన తోట గగన్, తోట మౌనిక, తోట వెంకటరమణ నందలూరులోని సౌమ్యనాథస్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి రాజంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి కడప వైపు వస్తున్న లారీ అదుపుతప్పి ఢీ కొంది. దీంతో హైవేలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్‌హెగ్డే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108లో రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న ఓబిలి గ్రామస్తులు
పెనగలూరు : మండలంలోని చెయ్యేరు నది ఆనుకొని ఉన్న ఓబిలి గ్రామం నుండి ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా గ్రామస్తులు, సీపీఐ నాయకులు శనివారం అడ్డుకున్నారు. నందలూరు మండలంలోని టంగుటూరు రీచ్ వద్ద ఇసుకను భారీ టిప్పర్లు లోడ్ చేసుకొని ఓబిలి గ్రామం ద్వారా వెళ్లడంతో గ్రామంలోని సిమెంటు రోడ్లు పాడవడంతో పాటు దుమ్ము విపరీతంగా వస్తుండటంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న సీపీఐ నాయకులు గ్రామస్తులకు అండగా నిలవడంతో ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. టిప్పర్లు విపరీతంగా వెళ్లడంతో పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు