భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు

Aug 3 2025 3:08 AM | Updated on Aug 3 2025 3:08 AM

భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు

భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు

వీరబల్లి : మండలంలోని సంఘంవాండ్లపల్లెకు చెందిన జుట్టు చెండ్రాయుడు అనే వ్యక్తి కనబడలేదంటూ అతని భార్య స్థానిక పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం గొర్రెల వ్యాపారం నిమిత్తం వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త శుక్రవారం తనకు ఫోన్‌ చేసి రాజంపేటకు వెళ్తున్నానని చెప్పి ఫోన్‌ కట్‌ చేసినట్లు తెలిపారు. మూడు రోజులు గడుస్తున్నా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మార్కెట్‌ యార్డులో

హమాలీపై దాడి

మదనపల్లె రూరల్‌ : పట్టణంలోని నీరుగట్టువారిపల్లె టమాటా మార్కెట్‌ యార్డులో హమాలీపై మందు బాబులు దాడి చేసిన ఘటన శనివారం జరిగింది. నీరుగట్టువారిపల్లె మార్కెట్‌ యార్డు ఏబీ టమాటా మండీలో బావాజాన్‌(48) హమాలీగా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు పూటుగా మద్యం సేవించి దారి విషయమై బావాజాన్‌తో గొడవపడి రాళ్లతో దాడిచేసి కొట్టారు. దాడిలో గాయపడిన బాధితుడిని స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టూటౌన్‌ పోలీసులు విచారణ చేస్తున్నారు.

అత్తింటి వేధింపులపై

కేసు నమోదు

మదనపల్లె రూరల్‌ : అత్తింటి వేధింపులపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. కర్నాటక ముళబాగల్‌ ముత్యాలపేటకు చెందిన నాగరాజ, సుగుణ కుమార్తె జ్ఞానగిరి శిరీషాను మదనపల్లె మండలం పెంచుపాడు పంచాయతీ పందివారిపల్లెకు చెందిన దామోదర్‌కు ఇచ్చి 2017లో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నిరోజులుగా అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తుండగా, వారి వేధింపులు భరించలేక రెండునెలల క్రితం శిరీషా పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తింటిలో వేధింపులపై శనివారం తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు భర్త దామోదర్‌, అత్త చంద్రమ్మ, మామ వెంకటరమణలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై టీడీపీ నేత లైంగిక వేధింపులు

పీలేరు రూరల్‌ : ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన టీడీపీ నాయకుడిపై బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముడుపులవేముల పంచాయతీ దళితవాడకు చెందిన పల్లెపాగు రెడ్డికాంత భర్త 2024 జూలై 24న అనుమానాస్పద స్థితిలోమృతి చెందాడు. ఆమె గ్రామంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే పంచాయతీ ఠాణావడ్డిపల్లెకు చెందిన యల్లమంద శ్రీనివాసులు ఏడాది కాలంగా రెడ్డికాంతను మానసికంగా, లైంగికంగా వేధింపు లకు గురి చేస్తున్నాడు. అతని వేధింపులు తాళలేక శనివారం సీఐ యుగంధర్‌కు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement