
ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి
రాయచోటి : ప్రభుత్వ బడులలో పనిచేసే ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి మినహాయించి బోధనకే పరిమితం చేయాలని, బోధనను హరించే యాప్‌లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో నాయకుడు ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి పెండింగ్ డీఏలను చెల్లించాలన్నారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జాబిర్ మాట్లాడుతూ పి–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదన్నారు. ఫ్యాప్టో జనరల్ సెక్రటరీ గఫార్ ఖాన్ మాట్లాడుతూ నూతనంగా అప్‌గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు ఎం,రెడ్డన్న, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడారు. కార్యక్రమంలో ఫ్యాఫ్టో జిల్లా కో–చైర్మన్‌లు శివారెడ్డి, ఇలియాస్, హరి ప్రసాద్, జిల్లా కోశాధికారి జఫరుద్దీన్, బీలు నాయక్, ఫ్యాప్టో రాష్ట్ర బాధ్యులు రవీంద్రారెడ్డి, రామచంద్ర, డీసీఐబీ సెక్రటరీ నాగముని రెడ్డి, ఫ్యాప్టో నాయకులు సుధాకర్ నాయుడు, ఎస్.శివారెడ్డి, బి.చంద్రశేఖర్, రెడ్డప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఏఓ నాగభూషణంకు వినతిపత్రం అందజేశారు.