
చెరువుకుంట కబ్జాకు యత్నం
సుండుపల్లె : మండల పరిధిలోని మడితాడు గ్రామ పంచాయతీ జికె రాచపల్లి గ్రామ పొలంలో సర్వే నెంబర్ 992లో 3.60 సెంట్లు భూమి చెరువుకుంట ఉంది. ఇది రాయచోటి ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో మండలానికి చెందిన టీడీపీ పార్టీకి చెందిన నాయకుడి ఓ కన్ను పడింది. దీనిని ఆక్రమించడానికి జేసీబీతో చదును చేశాడు. అంతేకాకుండా సర్వే నెంబర్ 991/ఏలో 0.7 సెంట్ల భూమి పట్టా ఉందని, పక్క భూమి సర్వే నెంబర్ వేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, కుంట సర్వే నెంబర్లో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు చదును చేశాడని శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి గురువారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అదేకాకుండా సర్వే నెంబర్ 994/ఏలో 0.4 సెంట్లు ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారని, ఇంకా మరికొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదులో తెలిపారు. కబ్జాదారుల నుంచిప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.