
వేతనాలు అందక వెతలు
ఎదురుచూపులు
కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పది రకాల పాఠశాలల్లో 5 రకాల పాఠశాలల ఉపాధ్యాయులు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అప్‌గ్రేడ్ అయిన ప్రాథమికోన్నత, కొత్తగా ఏర్పాటైన మోడల్ ప్రైమరీ పాఠశా లలు, కొత్తగా పదోన్నతులు పొందిన స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్–2 హెచ్‌ఎంలకు జీతాలు రాలేదు. వీరందరికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ పాఠ శాలలకు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలను కేటాయించారు. వాస్తవానికి ఆ పాఠశాలల్లో గతంలో కేడర్ స్ట్రెంత్‌కు అనుగుణంగా ఉన్న పోస్టులకు జీతాలు చేసే వీలుంటుంది. కొత్తగా వచ్చిన పోస్టులకు పొజిషల్ ఐడీలు కేటాయించిన తరువాతే జీతాలకు అవకాశం ఉంటుంది. అప్‌గ్రేడ్ అయిన యూపీ స్కూళ్ల టీచర్లకుఇదే ప్రధాన సమస్యగా మారింది.
● పొజిషన్ ఐడీలు కేటాయింపుల్లో నిర్లక్ష్యం
● జీతాలు రాక అవస్థలు పడుతున్న టీచర్లు
● విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపాటు
మదనపల్లె సిటీ: బదిలీలు ఉపాధ్యాయులకు శాపంగా మారాయి. ఈ ప్రక్రియ ప్రారంభం నుంచి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా స్థాన చలనం కలిగిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యాశాఖ పొజిషన్ ఐడీలు ఇవ్వకపోవడంతో జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. బదిలీల సాకుతో వారికి జీతాలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడుతున్నాయి.
● కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధ్యాయ బదిలీ చట్టం ద్వారా ఇటీవల పలువరు టీచర్లకు పదోన్నతులు,బదిలీలు జరిగాయి. వీరిలో వేలాది మందికి పొజిషన్ ఐడీలు రాక జూన్ నెల నుంచి ఇప్పటి వరకు జీతం అందలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4,737 ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 18,540 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 వేల మందిని బదిలీ చేశారు. అదే విధంగా హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు 800 వరకు ఉన్నారు. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో 4217 మంది వివిధ క్యాడర్లలో బదిలీ అయ్యారు. వీరిలో 202 మంది గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, 1815 మంది స్కూల్ అసిస్టెంట్లు, 2047 మంది సెకండ్ గ్రేడ్ టీచర్లు, 114 మంది లాంగ్వేజ్ పండిట్లు, 11 మంది ఏఆర్‌టీ క్రాఫ్ట్,మ్యూజిక్ ఒకేషన్ టీచర్లు, 28 మంది పీడీలు ఉన్నారు. బదిలీలు సాధారణంగా ఉపాధ్యాయ, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓలకు సమాచారం అందిస్తారు. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నా వీరి స్థానం మారడంతో బదిలీ అయిన స్థానానికి పొజిషన్ ఐడీ కేటాయించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సీఎఫ్‌ఎంఎస్‌లో వారి వివరాలు కనిపిస్తాయి. అప్పుడు జీతాలు చెల్లించడానికి వీలుంటుందని ఉద్యోగ,ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అన్యాయం
పొజిషన్ ఐడీలు ఇవ్వకుండాఆ ఆలస్యం చేయడం అన్యాయం. నెలల తరబడి ఐడీల పేరుతో జీతాలు ఇవ్వకపోవడం సరికాదు.ఈ సమస్య రాష్ట్రం మొత్తం ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా అలసత్వం వహించడం సరికాదు. –రెడ్డప్పరెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
పొజిషన్ ఐడీలు మంజూరు చేయాలి
పొజిషనల్ ఐడీలు మంజూరు చేయాలి. టీచర్ల పట్ల ఇంత చులకన భావన ఎందుకో..రెండు నెలల జీతాలు రాకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.. కేడర్‌స్ట్రెంత్ నివేదికలు సిద్ధం చేసి పొజిషన్ ఐడీలు ఇవ్వడం పట్ల అలసత్వం వహించడం దారుణం. –ఆర్.వి.రమణ, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి

వేతనాలు అందక వెతలు

వేతనాలు అందక వెతలు