కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన టి.రమేష్ రెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
విజయవాడలో హజ్ ఎంబార్కేషన్ కేంద్రం
మదనపల్లె సిటీ: హజ్‌యాత్రికుల సౌకర్యార్థం విజయవాడలో కొత్తగా హజ్ ఎంబార్కేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు పఠాన్ ఖాదర్‌ఖాన్ తెలిపారు. ఈ నిర్ణయంతో యాత్రికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. యాత్రికులు విజయవాడ కేంద్రంగా ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవాలన్నారు.
గురుకులంలో నేరుగా ప్రవేశాలు
కడప రూరల్: వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని 24 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి ఖాళీలను భర్తీ చేయడంలో భాగంగా నేరుగా ప్రవేశాలు పొందవచ్చని జిల్లా సమన్వయకర్త ఉదయశ్రీ తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ వరకు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా తరగతుల్లో చేరడానికి, విద్యార్థులు నేరుగా స్థానిక గురుకుల పాఠశాల ప్రిన్సిపల్స్‌ను సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని అన్నారు.
దరఖాస్తు చేసుకోవాలి
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని దివ్యాంగులు వినికిడి యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల సంఘం జిల్లాఅధ్యక్షుడు చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి అవసరాలను బట్టి భారత ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ దివ్యాంగులకు పరీక్ష నిర్వహించి వినికిడి యంత్రాలను అందజేస్తుందని తెలిపారు. చేతి కర్రలు, వాకర్లు, మూడు కాళ్ల వాహనాలు, నాలుగు చేతి కర్రలు, వీల్ చైర్లు, తోపుడుబండ్లు, బ్యాటరీ సైకిళ్లు, మూడు చక్రాల సైకిళ్లు అందించనున్నట్లు చెప్పారు. ఆగస్టు 6న లక్కిరెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఢిల్లీ బృందం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.వారంలోపు వినికిడి యంత్రాలు అందజేస్తారన్నారు.
అది అసత్య ప్రచారం
రాయచోటి టౌన్: రాయలసీమ ప్రాంతానికి చెందిన కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు గృహ హింస చట్టం–2005 అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అసత్యపు ప్రచారమని జిల్లా సీ్త్ర, శిశుసంక్షేమ, సాధికారత అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గృహహింస చట్టం–2005ను ఆంద్రప్రదేశ్ ప్రభు త్వం ద్వారా జిల్లా స్థాయిలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాఽధికారత అధికారి ఆధ్వర్యంలో మాత్రమే అమలు జరుగుతోందన్నారు. గృహ హింసలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు గృహహింస నుంచి రక్షణ పొందేందుకు జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీలోని శిశుసంక్షేమ, సాధికారత కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని సూచించారు.
2న అన్నదాత సుఖీభవ కార్యక్రమం
రాయచోటి: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కార్యక్రమం నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్, పేదరికం లేని సమాజం – పీ4 కార్యక్రమం, ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ శ్రీధర్, సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. అ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో నగదు బదిలీ కార్యక్రమం జరుగుతుందని అధికారులకు సూచించారు.