
ఆగస్టు 31లోపు నాటుసారా రహితంగా జిల్లా
మదనపల్లె రూరల్: జిల్లాను ఆగస్టు 31లోపు నాటుసారా రహితంగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ ఎకై ్సజ్ సూపరిండెంట్ వై.జోగీంద్ర తెలిపారు. బుధవారం స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌లో సీఐ భీమలింగతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 71 సారా తయారీ గ్రామాలను గుర్తించామని, వాటిలో ఇప్పటివరకు 55 గ్రామాలను సారారహితంగా తీర్చిదిద్దామన్నారు. వి నవోదయం 2.0 కార్యక్రమం కింద జిల్లాలో 325 మందికి ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలను చూపి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కలెక్టర్ నిర్ణయం తర్వాత వారందరికీ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ప్రతి మద్యం షాపు వద్ద ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశామని, నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తిస్తే ప్రజలు సెల్‌ఫోన్‌లో స్కాన్ చేసి, ఫిర్యాదుచేయవచ్చన్నారు. మద్యంషాపుల్లో ఎంఆర్‌పీ ధరలకు మించి ఎక్కువగా అమ్ముతున్నా, గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నా... ఎకై ్సజ్‌శాఖ టోల్ ఫ్రీనెంబర్ 14405కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాలన్నారు.