
కల్లబొల్లి మాటలు మాని రైతులను ఆదుకోండి
రైల్వేకోడూరు అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక కూటమి నాయకులు కల్లబొల్లి మాటలు మాని వెంటనే బొప్పాయి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు.గురువారం స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయ రంగం అతలాకుతలమైందని తెలిపారు. రైతులు ప్రతి సారీ రోడ్డెక్కే పరిస్థితి రావడం దురదుష్టకరమని పేర్కొన్నారు. కోసిన పంట అమ్ముడుపోక ఉన్న ధరకు అమ్ముకోలేక తోటలలోనే వదిలేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం, కూటమి నాయకులు మాయమాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఏనాడు రైతులు కష్టాల పాలవ్వలేదన్నారు. అన్నదాతలను అన్నిర కాలుగా ఆదుకున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, నాయకులు సీహెచ్ రమేష్, నందబాల, మండారు మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు