
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి మండలంలో అడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కనిపిస్తోంది. గురువారం మండల పరిధి కొండమాచుపల్లి గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటం, ఆయన ప్రవేశపెట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే గోడపత్రాలు కనిపిస్తున్నాయి. ఈ పంచాయతీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి సంఘటనలు బయటపడడం ఇది రెండోసారి, అలాగే కొత్త మాధవరం గ్రాంమలోని పెద్దరోడ్డు వీధిలో టీడీపీ జెండా ఎగురుతూ కనిపించింది. సంబంధిత ఎన్నికల అధికారి కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారని ప్రజలు అంటున్నారు.