
పార్టీకీ అండగా నిలబడతాం
మాజీ సీఎంతో యూఏఈ కో–కన్వీనర్
సయ్యద్ అక్రమ్
రాయచోటి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని యూఏఈ కో–కన్వీనర్ సయ్యద్ అక్రమ్ అన్నారు. బుధవారం తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్‌తో కలిసి అక్రమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గల్ఫ్ దేశాలలో పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నట్లు మాజీ సీఎంకు తెలిపారు. కుటుంబ పోషణ నిమిత్తం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చిన వారి పరిస్థితులపై జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాలలో వైఎస్సార్‌సీపీ బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వారు వివరించారు.