
దౌర్జన్యంగా ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం
మదనపల్లె రూరల్ : ఇంటిలో తమకు హక్కు ఉందని పేర్కొంటూ, జేసీబీతో గోడను కూల్చివేసి దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన ఘటన బుధవారం అంకిశెట్టిపల్లె పంచాయతీ పప్పిరెడ్డిగారిపల్లె టీ చర్స్ కాలనీలో జరిగింది. పప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన కె.వెంకటరమణ, శంకరలు అన్నదమ్ములు. వీరికి వారసత్వంగా తండ్రి నుంచి సంక్రమించిన ఇంటి విషయ మై చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తు తం ఇంటిలో వెంకటరమణతో పాటు అతడి ఇద్దరు కుమారులు నరేంద్ర, శ్యాంసుందర్, కోడళ్లు శోభ, మంజుల, మనమరాళ్లు భవ్య, పూర్విక, తన్వి నివాసం ఉంటున్నారు. ఈ ఇంటిలో తమకు భాగం ఇవ్వాల్సిందిగా శంకర కోరుతూ వస్తున్నాడు. పెద్దమనుషుల వద్ద పంచాయతీ జరుగుతోంది. ఈ క్రమంలో శంకర జేసీబీని తీసుకువచ్చి ఇంటి గోడను కూల్చివేసేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో నిద్రపోతున్న కోడళ్లు శోభ, మంజుల, మనమరాళ్లపై దాడికి దిగి, ఇంట్లోని సామానులు బయటపడేసి వెళ్లిపోవాల్సిందిగా దౌర్జన్యానికి దిగారు. దీన్ని చూసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన వెంకటరమణ కూతురి కుమారుడు మనోజ్‌ను, వరుసకు చినతాత అయిన శంకర వీపుపై కొరికి గాయపరిచాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.