
జాతీయ స్థాయిలో కలికిరి సైనిక పాఠశాల విద్యార్థినుల ప్రతి
కలికిరి : తమిళనాడు రాష్ట్రం అమరావతినగర్ సైనిక పాఠశాలలో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు జరిగిన ఆల్ ఇండియా సైనిక పాఠశాలల ఆటల పోటీలలో కలికిరి సైనిక పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. అండర్ 17 విభాగం హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకుని రన్నరప్‌గా నిలిచినట్లు కలికిరి పాఠశాల ప్రిన్సిపాల్ సీఎస్ పరదేశి తెలిపారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోటీలలో కలికిరి టీం స్వల్ప తేడాతో ఓటమి చవిచూసినప్పటికీ గెలుపుకోసం అసాధారణంగా పోరాడిందన్నారు. ఈ సందర్భంగా హాకీ టీం బాలికలకు ఆయన అభినందనలు తెలిపారు.