
మత్తుతో జీవితం చిన్నాభిన్నం
రాయచోటి టౌన్ : మత్తుకు అలవాటు పడితే జీవితం చిన్నాభిన్నం అవుతుందని అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకట్రాది పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి శ్రీ సాయి శుభ కల్యాణ మండపంలో మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలపై టీనేజ్ యువకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలను ముందు సరదా కోసం ఉపయోగిస్తారని తరువాత వాటికి బానిసగా మారిపోయి జీవితాలనే నాశనం చేసుకుంటారని తెలిపారు. అలాంటి అలవాట్ల జోలికి వెళ్లకుండా మీ బంగారు భవిష్యత్తును మీరే తీర్చి దిద్దుకోవాలని సూచించారు. అలాగే పిల్లల అలవాట్లపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐలు లోకేష్, వెంకటేష్, గాయత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ యం.ప్రకాష్, ప్రతిభ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ అరమాటి శివగంగిరెడ్డి, రాజు విద్యాసంస్థల ప్రధానోపాద్యాయుడు వై. గంగన్న తదితరులు పాల్గొన్నారు.
అడిషన్ ఎస్పీ ఎం.వెంకటాద్రి