
బైక్ అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : బైక్ అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన గంగులప్ప కుమారుడు వలిగేశ్వర్(27) డిష్ యాంటెన్నా పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శనివారం స్నేహితుడైన ప్రకాష్(25)తో కలిసి ద్విచక్రవాహనంలో పనుల నిమిత్తం పుంగనూరు వెళ్లాడు. పుంగనూరు సమీపంలో వాహనానికి కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స కోసం మెరుగైన చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రామసముద్రం మండలంలో..
రామసముద్రం : ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయి ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన రామసముద్రం మండలంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరు దగ్గర ఏడూరుకు చెందిన ఆసిఫ్, కుమార్ లు రామసముద్రం నుంచి పుంగనూరు వైపు వెళ్తుండగా మినికి వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో కుమార్ కు ముక్కు దగ్గర, ఆసిఫ్ కు చేతిపైన తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ప్రసాద్, వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బైక్ అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలు