
యువకుడి మృతదేహం లభ్యం
సంబేపల్లె : మండల పరిధిలోని ఝరికోన ప్రాజెక్టు మొరవ సమీపంలోని మడుగులో ఆదివారం గల్లంతైన ఉస్మాన్ అనే యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. రాయచోటి అగ్నిమాపక సిబ్బంది, సంబేపల్లె పోలీసులు మడుగులో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఉస్మాన్ మృతదేహాన్ని వెలికి తీశారు. శవపరీక్షల నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడి మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
స్పందించని స్థానికులు..
యువకుడి మృతదేహాన్ని మడుగులో నుంచి బయటకు తీసుకు వచ్చే క్రమంలో ఒక్కరు కూడా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సహకరించకపోవడం దారుణం. ఎవరంతట వారు ఫొటోలు, వీడియోలు తీసి వాటా్‌స్ప్, ఫేస్‌బుక్‌లలో పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారే గానీ మృతదేహాన్ని వెలికి తీసేందుకు సాయపడదామని ఏ ఒక్కరూ స్పందించలేదు. దీంతో ఎస్‌ఐ భక్తవత్సలం, అగ్నిమాపక సిబ్బందే అతి కష్టం మీద మడుగులో నుంచి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు.

యువకుడి మృతదేహం లభ్యం