
మృగరాజుపై రారాజు
నందలూరు : శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు సోమవారం సింహవాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఉత్సవమూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఉభయ దేవేరులతో శ్రీ సౌమ్యనాథ స్వామి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి స్వామివారు సింహవాహనంపై మత్స్యావతావరంలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకుని గోవింద నామస్మరణలతో ఊరేగింపు వెంట కదిలివచ్చారు. సూపరింటెండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం, భక్తులు పాల్గొన్నారు.
● బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు మంగళవారం ఉదయం పల్లకీసేవ గ్రామోత్సవం, తిరుమంజనం, రాత్రికి హనుమంతు వాహనంపై విహరించనున్నారు.