
ఆరోగ్యశ్రీ పునర్జన్మనిచ్చింది
నాపేరు షేక్ ఆశాబీ. మాది రాజంపేట పట్టణంలోని బాలాజీనగర్. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల పునర్జన్మ పొందాను. ఆపరేషన్‌కు ఒక్కరూపాయి కూడా ఖర్చు కాలేదు. గుండెకు పెద్ద ఆపరేషన్ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. ఆరోగ్యశ్రీ పథకమే లేకుంటే నేను గుండెకు పెద్ద ఆపరేషన్ చేయించుకోలేక ఈ పాటికి ఈలోకానికి దూరం అయ్యేదానిని. వైఎస్సార్ ఇప్పుడు లేకపోయినా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మాలాంటి పేదోళ్లకు పునర్జన్మ ఇస్తుంది. ఆయన చనిపోయి ఏళ్లు గడుస్తున్నా పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు.