
బుద్ధుడి విగ్రహ ధ్వంసంపై నిరసన
రాయచోటి టౌన్ : మదనపల్లె రూరల్ పరిధి అంకిశెట్టిపల్లె సమీపంలోని బుద్ధుడి కొండపై ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం ధ్వంసంపై రాయచోటిలో నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయ సముదాయంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటం వద్ద భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లం తాతయ్య మాట్లాడుతూ బుద్ధుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని ఆరోపించారు. గతంలో కూడా మూడు సార్లు ఇలాగే చేశారని, దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అలాంటి దురాగతానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికై నా అధికారులు దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి రామాంజులు, బాస్ కుటుంబ సభ్యులు సి.రెడ్డెయ్య రాజు, పక్కీరయ్య, ఏ.నాగేశ్వరావు, సి.పామయ్య, జె.లక్షుమ్మయ్య, శ్రీరాములు, మురళీ తదితరులు పాల్గొన్నారు.