
భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంటు
రాజంపేట : అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలకు భారతి సిమెంటు పటిష్టమైనదని భారతి సిమెంటు టెక్నికల్ ఇంజినీర్ ఎస్. శ్రీకాంత్‌రెడ్డి, మార్కెటింగ్ అధికారి రమణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ట్రేడర్స్ సమీపంలోని మేసీ్త్రలకు సిమెంటు వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భారతి సిమెంటు ప్రతినిధులు మాట్లాడుతూ భారతి సిమెంటు రోబోటెక్ టెక్నాలజీతో తయారవుతుందన్నారు. ఇతర కంపెనీల సిమెంటు ఐదు గంటల్లో సెట్ అయితే, భారతి ఆల్ట్రా ఫాస్టు రెండు గంటల్లోనే సెట్ అవుతుందన్నారు. అనంతరం 50 మంది మేసీ్త్రలకు లక్ష రూపాయల ఉచిత బీమా బాండ్, బీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంటు డీలర్ రవి, మేసీ్త్రలు పాల్గొన్నారు.