రామాపురం : మండల పరిధిలోని కసిరెడ్డిగారిపల్లె పంచాయతీ పెట్రోల్ బంకు సమీపంలో బైకును టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో జంపు మహేశ్వర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. పోలీసుల వివరాల మేరకు చక్రాయపేట మండలం సురభి గ్రామం కుప్పగట్టపల్లెకు చెందిన జంపు మహేశ్వర్ కడప ఇండియన్ గ్యాస్ గోడౌన్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని చక్రాయపేటకు ఏపీ04ఏడీ ఏపీ2207 బైకుపై గువ్వలచెరువు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మీదుగా ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో గువ్వలచెరువు పెట్రోల్ బంక్ సమీపానికి రాగానే ఎదురుగా కడప వైపు వెళ్తున్న ఏపీ04యూ1215ల టిప్పర్ ఢీ కొంది. ఈ సంఘటనలో బైకుపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్ అమర్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉద్యోగులను మోసగిస్తున్న కూటమి సర్కార్
రాయచోటి అర్బన్ : ఉద్యోగులను మరోమారు మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని వైస్సార్‌సీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి విజయభాస్కర్ విమర్శించారు. ఆదివారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రూ. 6200 కోట్ల ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తామంటూ మభ్యపెడుతోందన్నారు. ప్రభుత్వం చెల్లిస్తామంటున్న రూ.6200 కోట్లలో 85 శాతం నిధులు సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాల్సి ఉందన్నారు. అలా చేయని పక్షంలో ప్రభుత్వానికి రిజర్వు బ్యాంకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి అప్పుగా ఇచ్చే ప్రసక్తే ఉండదన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతూ తామేమో ఉద్యోగుల బకాయిలను తీర్చేస్తున్నట్లు ఫోజులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జానం రవీంద్ర యాదవ్, సుగవాసి శ్యామ్‌కుమార్, సంజీవ, సాంబశివ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తికి తీవ్ర గాయాలు