
పుష్ప–2లో రాజంపేట వాసులు
రాజంపేట టౌన్ : ఇప్పుడు దేశవ్యాప్తంగా పుష్ప–2 మేనియా నడుస్తోంది. ఏ నలుగురు కలిసినా ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. అలాంటి పుష్ప–2 సినిమాలో రాజంపేట పట్టణానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు నటించారంటే నిజంగా విశేషమనే చెప్పాలి. మండలంలోని కొల్లావారిపల్లె ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న అరవ మోహన్‌రావు, మందపల్లె ప్రాథమిక పాఠశాలకు చెందిన కంభం శివకుమార్ ఈ చిత్రంలో నటించారు. ఇందులో మోహన్‌రావు అల్లుఅర్జున్ సోదరుడైన అజయ్‌కి వెన్నంటి ఉండే పాత్రను, శివకుమార్ వీడియో జర్నలిస్టు పాత్రను పోషించారు. పుష్ప–2 ఎంతో క్రేజీ మూవీ కావడం, అలాగే విడుదలైన అన్ని ప్రాంతాల్లో కాసుల వర్షం కురిపిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన సినిమాలో రాజంపేటకు చెందిన ఇద్దరు కళాకారులు నటించడం జిల్లా వాసులకే గర్వకారణమని చెప్పాలి. ఆ మూవీలో నటించిన ఇద్దరూ రాజంపేట పట్టణంలోనే నివాసముండటం, ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడం కాకతాళీయమైనప్పటికీ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకొంటున్నారు. వారు ఎవరి సిఫారసు లేకుండా తమలోని నటనా ప్రతిభను కనబరచి అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం.
సినిమాలో నటించిన
ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు

పుష్ప–2లో రాజంపేట వాసులు