
ప్రణాళికాబద్ధంగా జిల్లా అభివృద్ధికి కృషి
నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి: ప్రణాళికాబద్ధంగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాయచోటి కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం నిశాంత్ కుమార్ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2014 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నియమించిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఆర్‌ఓ, ఆర్డీఓ, జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్లు కల్యాణి, భావన, డీఆర్‌ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఏఓ నాగభూషణం నూతన కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. .
● జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ప్రో యాక్టివ్‌గా పనిచేయాలన్నారు. అమరావతిలో ఈనెల 15, 16న కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈనేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయాల గురించి వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్న కలెక్టర్
రాయచోటి టౌన్: రాయచోటి పట్టణంలోని శ్రీ వీరభద్రస్వామిని ఆదివారం నూతన కలెక్టర్ నిశాంత్‌కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

ప్రణాళికాబద్ధంగా జిల్లా అభివృద్ధికి కృషి