
మల్లయ్యకొండ ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెఇపారు. ఈ సర్వీసలో సీ్త్రశక్తి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు ఉదయం 5.30 గంటలకు, 6.30 గంటలకు మదనపల్లె డిపో నుంచి బయలుదేరి మల్లయ్యకొండకు చేరుతాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి మల్లయ్యకొండకు సాయంత్రం వరకు షటిల్ సర్వీసు నడుస్తుందని తెలిపారు.
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 15వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండలం, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు.
గంగమ్మా.. చల్లంగ చూడమ్మా లక్కిరెడ్డిపల్లి: కష్టాలు తొలగించి.. వర్షాలు కురిపించి సుభిక్షంగా ఉండేలా చూడు తల్లి అంటూ భక్తులు అనంతపురం గంగమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆదివారం అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మొక్కుబడులు ఉన్నవారు తలనీలాలు అర్పించి.. స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పొంగళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
సంబేపల్లె: మండల కేంద్రంలోని శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా వేపాకులతో ఆలయ ప్రాంగణమంతా శుద్ధి చేశారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయం ముందు భాగంలో బీజాక్షరాలతో కలిగి ఉన్న మహిమగల రాయికి భక్తులు పూజలు నిర్వహించారు. గంగమ్మా చల్లంగ చూడమ్మా అని వేడుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు.

మల్లయ్యకొండ ప్రత్యేక బస్సులు