
కడప టు బీహార్!
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా వాసులకు గుడ్‌న్యూస్. ఎందుకంటే ఇప్పటి వరకు బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా రాష్ట్రాలకు డైరెక్ట్ కనెకివిటీ రైలు ఉమ్మడి కడపజిల్లా రైలుమార్గంలో నడవలేదు. బీహార్‌లోని రక్సౌల్ నుంచి చర్లపల్ల్లి (తెలంగాణ) వరకు ఆరేళ్లుగా రైలు నడుస్తోంది. ఇప్పుడు ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను జిల్లా రైలుమార్గంలో తిరుపతి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పడు డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్ క్లియర్ కావడంతో ఉమ్మడి కడప జిల్లా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఈ రైలు నేరుగా బీహార్ నుంచి చర్లపల్లి మీదుగా జిల్లా రైలుమార్గం గుండా తిరుపతికి చేరనుంది.
ఇప్పటి వరకు గూడూరు జంక్షన్ నుంచి
ఉమ్మడి కడప జిల్లా వాసులు బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టాలు పడేవారు. రేణిగుంట–విజయవాడ మార్గంలోని గూడూరు జంక్షన్‌కు వెళ్లి తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ జంక్షన్ ఉమ్మడి కడప జిల్లా వాసులకు చాలా దూరం. కడప నుంచి గూడూరుకు 141 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు మూడుగంటలకు పైగా సమయం పడుతుంది. ఏ రైలుకు వెళ్లాలన్న గూడూరు జంక్షన్‌కు 4 గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు ఇక్కట్ల ప్రయాణం తప్పడం లేదు.
● 07052/51 నంబరుతో నడిచే రైలును రక్సౌల్(బీహార్) నుంచి తిరుపతి, తిరుపతి నుంచి రక్సౌల్‌కు పొడిగించారు. గుంతకల్, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్ మీదుగా వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నారు.
● ఝార్ఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ జ్యోతిర్లింగమైన బైద్యనాథ స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి కడప జిల్లావాసులకు వీలు కలుగుతుంది.
● ఉమ్మడి కడప జిల్లాలో రైల్వేపరంగా అనేక మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వేలాది మంది గుంతకల్ రైల్వేడివిజన్‌లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.వీరికి ఈ రైలు సౌకర్యవతంగా ఉంటుంది.
● బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని ధన్‌బాద్, రాంచీ, జాసిద్, ఒడిశా రాష్ట్రంలోని రూర్కేలా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్ పట్టణాలకు మార్గం సుగమమం కానుంది.
● ఉత్తర తెలంగాణతో ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుసంధానంగా ఈ రైలును నడవనుంది. దీంతో మంచిర్యాల, పెద్దపల్లి, ఖాజీపేట, తర్పూర్‌కాగజ్ నగర్‌లకు చేరుకోవచ్చు.
డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్‌క్లియర్
ఉమ్మడి కడప జిల్లా లైన్‌లో రక్సౌల్–చర్లపల్లి వీక్లీ
20 నుంచి తిరుపతి వరకు పొడిగింపు

కడప టు బీహార్!