కేవీపల్లె: బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ శ్రీధర్ చామకూరి పిలుపునిచ్చారు. బాల్య వివాహ్ ముక్త్ భారత్ దినోత్సవాన్ని పురష్కరించుకుని బుధవారం కేవీపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ‘బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్’ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం, నేరమని తెలిపారు. బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధికి బాల్య వివాహాలు ఆటంకం కల్గిస్తాయన్నారు. బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పల్లెపండుగ సీసీ రోడ్ల
నాణ్యతలో రాజీ వద్దు
పల్లె పండుక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్ల నాణ్యతలో రాజీ పడకుండా పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. బుధవారం మండలంలోని సొరకాయలపేట పంచాయతీ వంకవడ్డిపల్లెలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను తనిఖీ చేశారు. రోడ్డు నాణ్యత, పొడవు, వెడల్పు, అంచనా ఖర్చు వివ రాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కేవీపల్లె ఏపీ మోడల్‌స్కూల్‌ను కలెక్టర్ సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు వివరాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, డ్వామా, హౌసింగ్, డీఆర్‌డీఏ పీడీలు వెంకటరత్నం, శివయ్య, సత్యనారాయణ, తహశీల్దార్ క్రాంతికుమార్, ఎంపీడీవో సుధాకర్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
బాల్య వివాహం సాంఘిక దురాచారం
రాయచోటి (జగదాంబసెంటర్): బాల్య వివాహం సాంఘిక దురాచారం అని అన్నమయ్య జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.రమాదేవి, డీసీపీఓ వినోద్‌కుమార్ తెలిపారు. రాయచోటి పట్టణం మాసాపేటలో గల సుగవాసి రాజారాం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో బాల్ వివాహ ముఖ్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బాల్య వివాహ నిషేధ చట్టంపైన అవగాహన, బాలికలపై లైంగిక వేధింపులు, చైల్డ్ ట్రాఫికింగ్, ఫోక్సో చట్టంలోని అంశాలను విద్యార్థినులకు వివరించారు. డీఎంహెచ్‌ఓ డా.కొండయ్య, ఏఎస్‌ఐ బాదుల్లా, ప్రధానోపాధ్యాయులు శివకుమార్‌రెడ్డి, ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చామకూరి