కందకం.. ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

కందకం.. ప్రయోజనం

Oct 19 2024 2:34 AM | Updated on Oct 19 2024 2:34 AM

కందకం

కందకం.. ప్రయోజనం

ఉపాధి హామీలో కొత్త పథకం

మామిడి తోటల్లో వృత్తాకార కందకాల ఏర్పాటు

ఒక చెట్టుకు రూ. 1525

ఎకరం మామిడిి రైతుకురూ. 1,06,750 ఆదాయం

మంచి ఫలితాలు ఇస్తున్న కందకాల ఏర్పాటు

వర్షాలు కురుస్తున్నందున ఇదే సరైన సమయం

స్వంతంగా చేసుకొంటే ఎంతోమేలు

మామిడి తోటల్లో కంద కాలు ఏర్పాటు చేసుకోవడం తోటల రైతులే చేసుకొంటే ఎంతోమేలు జరుగుతుంది. ఈ పథకం ద్వారా పనులు చేయడానికి రైతుకు ఎటువంటి ఖర్చు ఉండదు. రైతులకే ఉపాధి హామీ జాబ్‌ కార్డులు ఉంటే వారు స్వయంగా ఈ పనులు చేసుకోవచ్చు. తద్వారా ఎకరానికి రూ.1,06,750 ఆదాయం అదనంగా సమకూరుతుంది.

– నాగన్న, మామిడిరైతు, కొత్తపల్లె

రోజువారీ కూలీ రూ.305

గిట్టుబాటు అవుతోంది

మామిడితోటల్లో రింగ్‌ట్రంచ్‌లు తవ్వకాల పను లు బాగా గిట్టుబాటు అవుతున్నాయి. ప్రతి రోజూ రోజువారీ కూలీ రూ. 305 వరకు గిట్టుబాటు అవు తుంది. మామిడి తోటల్లో చెట్లకింద నీడ పొద్దున పను లు చేయడం వలన పెద్దగా అలసట ఉండదు. – రమణ, ఉపాధిహామీ కూలీ, క్రిష్ణాపురం

వర్షాలు కరుస్తున్నందున

సద్వినియోగం అవుతుంది

మామిడి మొక్కలకు రింగ్‌ట్రెంచ్‌లు ఏర్పాటు చేసుకొనే పథకాన్ని మామిడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ఈపథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోంటే మంచి ఫలితాలు ఉంటాయి.

– జయరామిరెడ్డి, ఏపీవో, గుర్రంకొండ

గుర్రంకొండ: ఉపాధి హామీలో కొత్త పథకం ఇప్పుడిప్పుడే రైతుల దరి చేరుతోంది. మామిడి తోటల్లోని మామిడి చెట్లకు వృత్తాకార లేదా చతురస్రాకార కందాలను ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నారు. ఈ పథకం అమలుకు ఇదే సరైన సమయం. ఒక చెట్టుకు ప్రభుత్వం రూ.1525 వరకు చెల్లిస్తోంది. ఎకరం మామిడి తోటలు ఉన్న రైతుకు గరిష్టంగా రూ.1,06,750 వరకు ఆదాయం సమకూరుతోంది. వృత్తాకార కందకాల ద్వారా మామిడి చెట్లు మంచి పోషకాలతో కూడిన అభివృద్ధి సాధిస్తాయి. ఈపథకం గురించి జిల్లాలో ఇప్పుడిప్పుడే రైతులకు అవగాహన కల్పిస్తుండడంతో మంచి ఫలితాలు సాధిస్తోంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున మామిడి తోటల్లో ఈ పథకం వినియోగించుకొంటే మంచి ఫలితాలను రైతులు పొందవచ్చు.

జిల్లాలో 7632 ఎకరాల్లో

ప్రారంభమైన పథకం:

అన్నమయ్య జిల్లాలో మొత్తం 18,331 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. వృత్తాకార లేదా చతురస్రాకార కందకాలు ఏర్పాటు పథకం ప్రస్తుతం 7632 ఎకరాల్లో ప్రారంభమైంది. అన్ని నియోజకవర్గాల్లోని మామిడితోటల్లో రింగ్‌ ట్రంచ్‌లు (వృత్తాకార కందకాలు) ఏర్పాటు ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నారు. రైతులు ఇప్పుడిప్పుడే ఈపథకం అమలకు మొగ్గు చూపుతున్నారు.

రైతుకు ఎకరానికి రూ.1,06,750 ఆదా:

ఉపాధి పథకం ద్వారా మామిడితోటల్లో వృత్తాకార కందకాలు ఏర్పాటు చేసే పథకంతో మామిడిరైతుకు ఎకరానికి రూ. 1.06,750 ఆదా అవుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎకరానికి 70 మామిడి చెట్లు పెంచాల్సి ఉంటుంది. ఒక్కో చెట్టుకు ప్రభు త్వం ఒక క్యూబిక్‌ మీటరుకు రూ: 305 చొప్పున ఐదు క్యూబిక్‌ మీటర్ల మేరకు రూ.1525 రైతుకు చెల్లిస్తుంది. ఈలెక్కన ఎకరానికి ఎంతలేదన్నా రూ.1,06,750 ఆదాయం రైతులకు వస్తోంది.

ఒక మొక్కకు 5 క్యూబిక్‌ మీటర్లు: ఉపాధి పథకంలో ఒక మామిడి మొక్కకు ప్రభుత్వ నిబంధనల మేరకు 5 క్యూబిక్‌ మీటర్ల మేరకు పనిచేసిన కొలతలు తీసి డబ్బులు చెల్లిస్తారు. ఒక మామిడి చెట్టుకు చుట్టూరా నిబంధనల మేరకు ఒక మీటరు పొడవు/వెడల్పు/ లోతు మట్టిని తీయాల్సి ఉంటుంది. మామిడి మొక్క ఎదుగుదల వెడల్పును బట్టి కొలతలు మార్చుకోవచ్చు. ఒకమీటరు నుంచి రెండు మీటర్ల మేరకు పొడవు/వెడల్పు/ దానికి తగ్గట్టుకు అర్థ అడుగుమేరకు లోతుతో కందకాలు తవ్వుకోవచ్చు. ఎలా పనిచేసినా నాలుగు నుంచి ఐదు క్యూ బిక్‌ మీటర్ల మేరకు కూలీలకు డబ్బులు చెల్లిస్తారు.

మూడునెలల పాటు కందకాలు ఏర్పాటు:

మామిడి తోటల్లో రింగ్‌ట్రెంచ్‌లను రానున్న మూడునెలలు ఎంతో అనుకూలమని అని రైతులు అంటున్నారు. మామిడి కాయలు కోసిన తరువాత పూతపట్టిసమయంకు మధ్యలో ఈసీజనే కందకాల ఏర్పాటుకు మంచి అదనుగా ఉంటుంది. , అక్టోబర్‌,నవంబర్‌, డిసెంబర్‌నెలలో ఈ పథకం సద్వినియోగం చేసుకోవడం వలన చెట్టుకు పూత ఏర్పడేందకు ఎటువంటి ఆటంకాలు ఉండవు.

వర్షాలు కురుస్తున్నందున సరైన సమయం:

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం విస్తార ంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు మామిడితోటల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈపథకం అమలుకు ఇదే సరైన సమయం అని అధికారులు అంటున్నారు. తోటల్లో కందకాలు తవ్వేందకు కూడా ఎక్కువ కష్టం ఉండడు. తేమ ఎక్కువగా ఉండడంతో పనులు వేగంగా జరుగుతాయి. తద్వారా ఈసీజన్‌లో కురిసే వర్షాలకు కందకాల్లో వర్షఫు నీరు నిలిచి మామిడి చెట్లకు పోషకాలు, సత్తువ వచ్చే అవకాశముంటుంది.

జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో

ఉన్న మామిడి తోటల వివరాలు

నియోజకవర్గం మామిడి తోటలు (ఎకరాలు)

వర్షపు నీటి నిల్వతో మంచి పోషకాలు

వృత్తాకార కందకాలు (రింగ్‌ట్రెంచ్‌)లను మామిడి చెట్లకు ఏర్పాటు చేయడం ద్వారా వర్షపునీటి నిల్వలతో చెట్టుకు మంచి పోషకాలు లభిస్తాయి. కందకాలు లేక పోతే చెట్టు దగ్గర వర్షపునీరు నిలిచే పరిస్థితి ఉండదు. రింగ్‌ ట్రెంచ్‌ల ఏర్పాటుతో వర్షపునీరు మొత్తం కందకాల్లో చేరి నిండిపోతుంది. దీంతోపాటుగా కుళ్లిన ఎరువులు కందకాల్లో చేరుతాయి. నీటి వసతితోపాటు ఎరువులు సమృద్ధిగా మామిడి చెట్టుకు లభిస్తాయి. తద్వారా మామిడి చెట్టు ఎటువంటి రసాయనిక ఎరువులు వినియోగించకుండానే సేంద్రియ ఎరువులతో మంచి ఎదుగుదల చెందుతుంది. దీనికి తోడు మామిడి మొక్క మొదట్లోపెద్ద ఎత్తున మట్టి వేయడం వలన చెట్టు తుఫాను, ఈదురు గాలుల నుంచి తట్టుకొని నిలబడే శక్తి చెట్టుకు వస్తుంది.

పీలేరు 3125

మదనపల్లె 2768

తంబళ్లపల్లె 3154

రాయచోటి 3385

రాజంపేట 2963

రైల్వేకోడూరు 2936

మొత్తం 18,331

కందకం.. ప్రయోజనం 1
1/6

కందకం.. ప్రయోజనం

కందకం.. ప్రయోజనం 2
2/6

కందకం.. ప్రయోజనం

కందకం.. ప్రయోజనం 3
3/6

కందకం.. ప్రయోజనం

కందకం.. ప్రయోజనం 4
4/6

కందకం.. ప్రయోజనం

కందకం.. ప్రయోజనం 5
5/6

కందకం.. ప్రయోజనం

కందకం.. ప్రయోజనం 6
6/6

కందకం.. ప్రయోజనం

Advertisement
 
Advertisement
Advertisement