
నిందితుడితో సెబ్ అధికారులు
కేవీపల్లె : 15 లీటర్ల సారా తోపాటు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పీలేరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) సీఐ వై. గురుప్రసాద్ తెలిపారు. మండలంలోని బురుజుకాడపల్లె అటవీ ప్రాంతంలో సారా తయారీ చేస్తున్నట్లు అందిన సమాచారంతో సెబ్ సిబ్బంది దాడి చేశారు. ఈ సందర్భంగా బురుజుకాడపల్లెకు చెందిన ఎస్. రఫీబాషా సారా కలిగి ఉండగా అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ దాడిలో సెబ్ ఎస్‌ఐ లక్ష్మీనరసయ్య, సిబ్బంది సుధాకర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వేర్వేరు ప్రాంతాల్లో
ఇద్దరు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : కుటుంబసమస్యలతో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వివాహితలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని వేంపల్లెకు చెందిన శ్రీనివాసులు భార్య కే.వరలక్ష్మి(35) బుధవారం ఇంటివద్దే నిద్రమాత్రలు మింగింది. అదేవిధంగా చంద్రాకాలనీకి చెందిన రమేష్ భార్య డి.హేమమాలిని(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మదనపల్లె తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని వృద్ధురాలి మృతి
మదనపల్లె : ద్విచక్రవాహనం ఢీకొని శతాధిక వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మంగళవారం రాత్రి వాల్మీకిపురం మండలంలో జరిగింది. చింతపర్తి గ్రామానికి చెందిన లక్ష్మణాచారి భార్య నారాయణమ్మ(102) రోడ్డుపై నడిచివస్తుండగా బైక్ వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని కుటుంబసభ్యులు 108 వాహనంలో వాల్మీకిపురం కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి వచ్చేలోపు ఆమె మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి బుధవారం కుటుంబసభ్యులకు అప్పగించారు. వాల్మీకిపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సర్వేయర్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
కురబలకోట : కురబలకోట మండల సర్వేయర్ గుండ్లూరి భువనేశ్వరిపై సస్పెన్షన్ ఎత్తి వేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె తిరిగి కురబలకోట మండల సర్వేయర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. సర్వేలో భాగంగా ఎఫ్ లైన్‌లు సకాలంలో చూడడం లేదన్న కారణంపై సర్వేయర్ భువనేశ్వరిని ఈ ఏడాది జూలై 14న జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్ సస్పెండ్ చేశారు. దీనిపై ఆమె తన సస్పెన్షన్ అక్రమమని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన హైకోర్టు తిరిగి ఆమెను అదే మండలంలో విధుల్లో చేర్చుకోవాలని సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ రాష్ట్ర కమిషనర్ సిద్దార్థ జైన్‌కు ఆదేశాలు జారీ చే సింది. దీంతో ఆమైపె సస్పెన్షన్ ఎత్తి వేశారు.

నారాయణమ్మ మృతదేహం

బాధ్యతలు చేపిట్టిన భవనేశ్వరి