
కేక్ కట్ చేస్తున్న ఎస్‌ఆర్‌ఐటీ కాలేజీ నిర్వాహకులు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక సాయిరాజేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాలకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి అటానమస్ హోదా లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగన్ రవి తెలిపారు. బుధవారం అటానమస్ హోదా వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలను ఏర్పాటు చేసి పది సంవత్సరాలు కావడం, యూజీసీ 2(ఎఫ్) గుర్తింపు, నాక్, ఎన్‌బీఏ అక్రిడిటేషన్, నాణ్యమైన విద్య అందిస్తుండటంతో స్వయం ప్రతిపత్తి గుర్తింపు వచ్చిందన్నారు. కళాశాల చైర్మన్ బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడు వీరకుమార్‌రెడ్డి, కరస్పాండెంట్ వీరకళ్యాణ్‌రెడ్డిలు మాట్లాడుతూ తమ కళాశాలకు అటానమస్ హోదా లభించడం సంతోషదాయకమన్నారు.