డిక్లరేషన్‌ పేరుతో డ్రామాలు ఎందుకు?: వైఎస్సార్‌సీపీ | YSRCP Serious On Chandrababu Naidu Govt Over Declaration Form Drama, Check More Details Inside | Sakshi
Sakshi News home page

YS Jagan Tirumala Visit: డిక్లరేషన్‌ పేరుతో డ్రామాలు ఎందుకు?: వైఎస్సార్‌సీపీ

Sep 27 2024 9:01 AM | Updated on Sep 27 2024 9:53 AM

YSRCP Serious On Chandrababu Govt Over Declaration

సాక్షి, తాడేపల్లి: తిరుపతి లడ్డూపై చంద్రబాబు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంద రోజుల పాలనలో హామీలు అమలు కాలేదని డైవర్షన్‌ కోసమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది.

ఏపీలో తాజా పరిణామాలపై వైఎస్సార్‌సీపీ స్పందిస్తూ.. ‘స్వార్థ రాజకీయాల కోసం సీఎం చంద్రబాబు సహా కూటమి నేతలు దేవుడిని వాడుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకే డిక్లరేషన్‌ పేరుతో డ్రామాకు తెరలేపారు. వైఎస్‌ జగన్‌ మొదటిసారి తిరుమలకు వెళ్లడం లేదు. పాదయాత్రకు ముందు కూడా తిరుమల వెళ్లారు. సీఎం హోదాలో శ్రీవారికి వైఎస్‌ జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరునామాలతో స్వామి వారి సేవలో పాల్గొన్న వారికి ఇప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వాలని రాజకీయాలు చేస్తారా?.

వైఎ‍స్సార్‌సీపీ నేతలకు నోటీసుల పేరుతో ఈ రాద్ధాంతం దేనికి?. సెక్షన్‌-30 పేరుతో పార్టీ నేతలకు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు. వంద రోజుల పాలనలో హామీలు అమలు కాలేదని డైవర్షన్‌ కోసమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అంటూ కామెంట్స్‌ చేసింది.

ఇది కూడా చదవండి: వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’గోల

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement