AP Government: రైతన్నలకు వెన్నుదన్ను

YSRCP Government Been Fully Supporting Farmers - Sakshi

బాబు హయాంలో కమిటీ పేరుతో కాలయాపన

సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వేగవంతంగా సాయం

రైతు మరణిస్తే రూ. 5 నుంచి 7 లక్షలకు పెంచి అందిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం

అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో 166 మందికిగాను 156 కుటుంబాలకు పరిహారం

వ్యక్తిగత విమర్శలే లక్ష్యంగా జనసేన సభ

‘మానవత్వంతో నిండిన ప్రభుత్వం మాది... రైతులకు సంబంధించి చిన్నపాటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటున్నాం. అన్నదాతలకు పంట సాగుకు ముందే విత్తనాలు, ఎరువులు ఇస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న  రైతు కుటుంబాలకు వేగంగా పరిహారం అందిస్తున్నాం. అంతేకాదు గతంలో టీడీపీ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరిహారం ఇవ్వడంలో కమిటీల పేరుతో కాలయాపన చేసేవారు. అందరికీ కాకుండా కొందరికే అది కూడా రూ. 5 లక్షలు అందించేవారు. ఆ పరిస్థితి నుంచి పరిహారం సొమ్మును రూ. 7 లక్షలకు పెంచాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెందిన వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 7లక్షలు జమ చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం’’        
   – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోన్‌రెడ్డి 

సాక్షి రాయచోటి : వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నదాతలకు పూర్తిగా అండగా ఉంటోంది. ఏ కష్టం వచ్చినా సకాలంలో ఆదుకుంటోంది.  క్రమక్రమంగా కరువు పారిపోతోంది....వర్షాలు సకాలంలో కురుస్తుండడం...›ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తుండడం....కాలువల్లో జలాలు ఉరకలెత్తుతుండడంతో పంట పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. అంతేకాకుండా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా పల్లె ముంగిట రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి అన్నదాతకు అండగా నిలుస్తోంది. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ప్రజల్లో ముద్ర వేసుకుంటోంది.  ఇదే తరుణంలో 2014 నుంచి ఇప్పటివరకు పంటలపై అప్పుల భారం పెరిగి ఆత్మహత్య లు  చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేస్తోంది. టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న వారికి కూడా పెంచిన పరిహారం సొమ్మును అందిస్తూ మానవత్వం ఉన్న ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందుతోంది.  రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కు టుంబాలకు వేగవంతంగా పరిహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తద్వారా  ఆ కుటుంబాలకు పరిహారం వెంటనే అందుతోంది. 

156 కుటుంబాలకు పరిహారం 
అన్నమయ్య జిల్లాతోపాటు వైఎస్సార్‌ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి పరిహారం రూ. 7 లక్షలు చొప్పున అందించింది.  ∙2014 నుంచి ఇప్పటివరకు అన్నమయ్య జిల్లాలో 58 మంది ఆత్మహత్య చేసుకోగా 53 మందికి పరిహారం కింద రూ. 2.82 కోట్లు అందించారు. వైఎస్సార్‌ జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా 103 కుటుంబాలకు రూ. 7.21 కోట్లు అందించారు. అన్నమయ్య జిల్లాతోపాటు  వైఎస్సార్‌ జిల్లాను కలుపుకుని మొత్తంగా ఇటీవల కాలంలో మృతి చెందిన 10 మందికి పరిహారం అందాల్సి ఉంది.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ పరిహారం అందిస్తోంది. అయితే  ప్రతిపక్షం,  జనసేన నాయ కులు కావాలనే నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో  సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  కాగా..  ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున  జనసేన పార్టీ తరుపున  అందిస్తున్నా...  అంతకుమునుపే రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ రూ. 7 లక్షలు చొప్పున పరిహారం అందించడం కొసమెరుపు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top