AP: ఫ్రీ బీస్‌ కేసులో అఫిడవిట్‌ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ

YSRCP Filed Affidavit Supreme Court On Freebies Case - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఫ్రీ బీస్‌ కేసులో సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. సంక్షేమ పథకాలపై సుప్రీంకోర్టులో ఇంటెర్వీన్‌ పిటిషన్‌ దాఖలైంది. వైఎస్సార్‌సీపీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.
చదవండి: ఉచిత హామీలంటే ఏంటో తెలియాలి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

కాగా, ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత హామీలు చేయకుండా నిరోధించాలని కోరుతూ లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఉచితాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని.. ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ఇక్కడ ప్రధాన అంశమని పేర్కొంది. ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, దీనిపై మరింత చర్చ జరగాలని జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. శనివారం (ఆగస్టు 20)లోగా తమ సూచనలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top