
తిరుపతి తిరుపతిలో అనేక నెలలుగా 8 కిలోమీటర్ల మేర వీధి దీపాలు వెలగకపోవడంతో వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కిలో మీటర్ల మేర వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారడంతో వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీది దీపాలు వెంటనే వెలిగించాలని వర్షంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ మేరకు భూమన అభియన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘...తిరుపతి హైవేలో అనేక నెలులుగా 8 కిలోమీటర్ల మేర బీద దీపాలు వెలగడంలేదు. రూ. 12 లక్షల బకాయి కారణంగా స్ట్రీట్ లైట్స్ నిలిచిపోయాయి. ఈ ప్రాంతం కొంత తిరుపతి, మరికొంత చంద్రగిరి నియోజకవర్గాలకు వస్తుంది. దీనిపై వెంటనే చంద్రగిరి ఎమ్మెల్యే నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్పందించాలి.
వీది దీపాలు వెలిగెలా చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తున్నాము. వీధి లైట్లు వెలగని కారణంగా ఈ రహదారిలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇకనైన ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పై ఉంది. ప్రభుత్వం స్పందించకుంటే నిరసన ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు.