
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనంతపురంజిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనంతపురం చేరుకుంటారు.
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ కార్యక్రమం బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వీఎస్‌ఎస్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ వేడుకకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజుకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ నాయకులు ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, కారుమూరి సునీల్‌కుమార్, గూడూరి ఉమాబాల, పాతపాటి మురళీకృష్ణంరాజు, మేకా ప్రతాప్ అప్పారావు, తెల్లం బాలరాజు, కొఠారు అబ్బయ్యచౌదరి, తలారి వెంకట్రావు, కంభం విజయరాజు, మామిళ్లపల్లి జయప్రకాష్, చినమిల్లి చినవెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు.
కాగా, వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు జోరు వానను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. వారందరికీ వైఎస్ జగన్ అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరించారు.