వైఎస్‌ జగన్‌ నిర్ణయం చారిత్రాత్మకం..!

Anantapur And Hindupur YSRCP MP Candidates Are BC - Sakshi

సాక్షి, అనంతపురం: అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం లోక్‌సభ అభ్యర్థి తలారి రంగయ్య అభిప్రాయపడ్డారు. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన అంబేద్కర్‌, జ్యోతిరావు పూలే బాటలో వైఎస్‌ జగన్‌ పయనిస్తున్నారని ఆయన అన్నారు. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తలారి రంగయ్యను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అలాగే జిల్లాలోని హిందూపురం లోక్‌సభ స్థానానికి కూడా బీసీ అభ్యర్థి గోరట్ల మాదవ్‌కు అవకాశం కల్పించారు. అలాగే కళ్యాణదుర్గం (ఉష శ్రీచరణ్‌), పెనుగొండ (శంకర్‌నారాయణ) అసెంబ్లీ స్థానాలను సైతం బీసీ అభ్యర్థులకే కేటాయించారు.  వైఎస్‌ జగన్‌ నిర్ణయంపై జిల్లాలోని బీసీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో బీసీలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేశారని, బీసీల అభ్యున్నతికి వైఎస్‌ జగన్‌ మాత్రమే కృషి చేయగలని వారు స్పష్టం చేశారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై కూడా బీసీలు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు బీసీల పార్టీ అని చెప్పుకునే అధికార టీడీపీ మాత్రం వెనుకబడిన కులాలకు సీట్లు కేటాయించకుండా.. ఉన్న సీట్లను సైతం లాక్కునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..!
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన..

అనంతపురంలోని బీసీల్లో మెజార్టీ వర్గంగా ఉన్న బోయ సామాజికవర్గం నుంచి రంగయ్య, కురుబ సామాజిక వర్గం నుంచి మాధవ్‌కు టిక్కెట్లు కేటాయించారు. దీంతో బీసీల అభ్యున్నతికి, రాజకీయ ఉన్నతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లయింది. పైగా ఇద్దరూ రాజకీయాలకు కొత్త ముఖాలే. విద్యావంతుడైన రంగయ్యను, పోలీసు శాఖలో డైనమిక్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న మాధవ్‌లను పార్టీలో చేర్చుకుని పార్లమెంట్‌ బరిలో నిలపడంతో సామాన్యులు కూడా చట్టసభల్లోకి వెళ్లడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని చెప్పినట్లయింది. అంతేకాదు ఇద్దరూ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు విధులు నిర్వర్తించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిందుకు బెదిరింపులను సైతం ఎదుర్కొన్న వారే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top