మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు | YS Jagan Tweet: YSRCP Supports Women Reservation Bill | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు

Mar 25 2026 4:46 PM | Updated on Mar 25 2026 6:13 PM

YS Jagan Tweet: YSRCP Supports Women Reservation Bill

సాక్షి, తాడేపల్లి: మహిళా రిజర్వేషన్ చట్టానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించింది. 2029 ఎన్నికల నుంచి ఈ చట్టాన్ని అమలు చేయటాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతించారు. మహిళా రిజర్వేషన్ అమలు మంచి నిర్ణయం అంటూ ఆయన ట్వీట్ చేశారు. మహిళల సాధికారతకు మా పార్టీ ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

‘‘నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు 50 శాతం అవకాశం కల్పించాం. నామినేషన్ ద్వారా ఇచ్చే పనులు, కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం. అసెంబ్లీ, లోక్‌సభలో 33% మహిళా ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్రం చట్టం చేయటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రతి స్థాయిలో మహిళలు నాయకులుగా ఎదగాలనేది మా పార్టీ ఆకాంక్ష’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్

 

   

Advertisement
 
Advertisement
Advertisement