
సాక్షి, తాడేపల్లి: కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనలో పలువురి మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో పలువురు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు.
రాయవరంలో జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.