మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | Ys Jagan Shocked Over Death Of Former Minister Gade Venkata Reddy | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

May 29 2026 4:59 PM | Updated on May 29 2026 6:32 PM

Ys Jagan Shocked Over Death Of Former Minister Gade Venkata Reddy

సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు. వెంకటరెడ్డి సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించారని... ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటన్నారు.

‘‘ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. తన తండ్రి డాక్టర్‌ వైఎస్సార్‌కు గాదె వెంకటరెడ్డికి  సన్నిహితులుగా ఉండేవారు. వైఎస్సార్‌తో కలిసి ప్రజా సమస్యలపై పనిచేస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించారు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

గాదె వెంకటరెడ్డి మృతిపై YS జగన్ సంతాపం

Advertisement
 
Advertisement
Advertisement