మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులర్పిస్తూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
అణగారిన వర్గాల వేదనను అక్షర రూపంలో జ్వాలగా మలిచి విప్లవానికి నాంది పలికిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) గారు. ``నేను సైతం.. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను`` అంటూ సామాన్యుల్లోనూ అభ్యుదయ భావాన్ని నింపిన అక్షర శిల్పి శ్రీశ్రీ..
..నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని ‘మహాప్రస్థానం’తో తట్టి లేపి, చైతన్యాన్ని తీసుకువచ్చిన ప్రజాకవి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.

అణగారిన వర్గాల వేదనను అక్షర రూపంలో జ్వాలగా మలిచి విప్లవానికి నాంది పలికిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) గారు. ``నేను సైతం.. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను`` అంటూ సామాన్యుల్లోనూ అభ్యుదయ భావాన్ని నింపిన అక్షర శిల్పి శ్రీశ్రీ. నిద్రావస్థలో ఉన్న… pic.twitter.com/WkhLrBdxjq
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 30, 2026


