
సాక్షి, తాడేపల్లి: నేడు ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు . తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి నేడు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు.
భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/cPB3xrhlKv
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2025
