
సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చిన్నారికి నామకరణం చేశారు. తల్లిదండ్రుల అభీష్టం మేరకు కెవిన్ అనే పేరు పెట్టారు.
తమ కుమారుడికి నామకరణం చేయాలని గోపాలపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ కొండాబత్తుల గిరి, జ్యోతి దంపతులు వైఎస్ జగన్‌ను కోరారు. గిరి, జ్యోతి దంపతుల కోరిక మేరకు కెవిన్ అనే పేరు పెట్టి, చిన్నారిని లాలించారు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా నామకరణం జరిగినందుకు గిరి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు