అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం | YS Jagan Mohan Reddy mingled with his fans | Sakshi
Sakshi News home page

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

Aug 1 2024 5:31 AM | Updated on Aug 1 2024 7:17 AM

YS Jagan Mohan Reddy mingled with his fans

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకం  

సాక్షి, అమరావతి: ఎవరూ అధైర్యపడవద్దు.. అన్ని విషయాల్లో చివరి వరకు అండగా ఉంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు. తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీస్‌లో బుధవారం కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. 

ఈ సందర్భంగా జగన్‌.. అందరినీ పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకు­న్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య­పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్‌సీపీ తోడుగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement