సుగాలీ ప్రీతి కేసులో బాబు సర్కార్‌ నిర్లక్ష్యంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం | YS Jagan Lashes Out At Chandrababu Government Over Sugali Preethi Case, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

సుగాలీ ప్రీతి కేసులో బాబు సర్కార్‌ నిర్లక్ష్యంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

May 26 2026 9:16 PM | Updated on May 27 2026 1:06 PM

YS Jagan lashes out at Chandrababu government over Sugali Preethi case

సాక్షి,తాడేపల్లి: సుగాలిప్రీతి కేసులో బాబు సర్కార్‌ నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసును ఆటకెక్కించటంపై ధ్వజమెత్తారు. ఈ మేరకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, వారి ఆవేదనను వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

ఆ ట్వీట్‌లో ‘10వ తరగతి చదువుతున్న  సుగాలి ప్రీతి 2017లో దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.  మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం.

కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది.

ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే..ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు, CDFD ల్యాబ్‌ రిపోర్టులు, డీఎన్‌ఏ ప్రొఫైల్‌ ఉన్న వివరాలను సైతం చూపించారు.

మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం’అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement