ప్రకాశ్‌ రాజ్ తల్లి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం | YS Jagan Expresses Condolences on Prakash Raj’s Mother’s Demise | Sakshi
Sakshi News home page

ప్రకాశ్‌ రాజ్ తల్లి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం

Mar 30 2026 3:29 PM | Updated on Mar 30 2026 4:01 PM

 YS Jagan Expresses Condolences on Prakash Raj’s Mother’s Demise

సాక్షి, తాడేపల్లి: ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మాతృమూర్తి సువర్ణలత (86) మృతి పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. సువర్ణలత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ప్రకాశ్‌ రాజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ఆకాంక్షించారు.

కాగా, ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఇవాళ ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం బెంగుళూరులో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.  

ప్రకాష్ రాజ్ తల్లి మరణంపై వైఎస్ జగన్ ఎమోషనల్

Advertisement
 
Advertisement
Advertisement